విజయవాడ నడిబొడ్డు నుంచి వెళ్లే బెంజి సర్కిల్ పైవంతెన కొత్త శోభను సంతరించుకోనుంది. త్వరలో వంతెన కింద ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. నిర్మాణానికి సంబంధించి నమూనాలు ఖరారయ్యాయి. పనుల అంచనాలు సిద్ధమై, టెండర్లు పిలిచారు. నవంబరులో పనులు మొదలై.. వేసవి నాటికి అందుబాటులోకి రానుంది. ఇది పూర్తి అయితే.. కాంక్రీట్ జంగిల్‌గా మారిన బెంజి సర్కిల్ ప్రాంతం పచ్చదనంతో నగరవాసులకు ఆహ్లాదం పంచనుంది.
కాస్త సేదతీరేందుకు పరిసర ప్రాంతాల వారికి అక్కరకు రానుంది. జాతీయ రాహదారి కావడంతో నగర అందాన్ని ఇనుమడింపజేయనుంది. పైవంతెన దిగువ భాగంలో ఒకటో స్తంభం నుంచి 43వ స్తంభం వరకు మొత్తం 1.1 కి.మీ నిడివితో పచ్చదనాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. దీని బాధ్యతలను విజయవాడ నగరపాలిక పర్యవేక్షిస్తోంది. ఇందుకు డిజైన్లను సిద్ధం చేసి, ఎన్‌హెచ్‌ఏఐ ముందు ఉంచింది. అవి ఆమోదం పొంది.. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయి ఆమోదం పొ వాటికి ఆమోదం తెలిపింది. అంచనా వ్యయం రూ. 2.75 కోట్లుగా తేల్చారు. దీనికి టెండర్లు పిలిచారు.
ఇదీ చదవండి: