రాష్ట్రవ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. తమకు కనీస టైమ్ స్కేల్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఓ నెంబరు 24 ను అమలు చేయాలంటూ.. గాంధేయ మార్గంలో అన్ని విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు.
2 వేల మంది అధ్యాపకులు కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంటు ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై జీవో ఇచ్చినా.. ఇప్పటి వరకూ అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సత్వరమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని వనరులను సమీకరించండి: మంత్రి అనిల్