ETV Bharat / state

దుర్గ గుడికి పెరిగిన రద్దీ..స్తంభించిన ట్రాఫిక్​

దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా... విజయవాడ నగరంలో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సమీపంలోని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

విజయవాడలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
author img

By

Published : Oct 5, 2019, 5:21 PM IST

విజయవాడలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్

దసరా నవరాత్రుల దృష్ట్యా కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. మూలా నక్షత్రం కావటంతో దుర్గగుడి వద్ద భక్తుల రద్దీ పెరిగింది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సమీపంలోని గట్టు వెనుక ప్రాంతంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. సితార కూడలి నుంచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.

ఇదీ చూడండి: ఏడో రోజు శ్రీ మహా సరస్వతీ దేవిగా..బెజవాడ దుర్గమ్మ

Intro:AP_VJA_22_05_DATTAPEETAMLO_SARASWATHI_PUJALU_737_AP10051

విజయవాడ దత్త పీఠం లోని శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవి ఆలయంలో సరస్వతి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, అలంకారం, అర్చనతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చక్కెర పొంగలి తో అన్నా అర్చన, వడ ల తో విశేషార్చనలు చేశారు. శ్రీ సరస్వతి పూజ, హోమం, భక్తులు విద్యార్థులతో సరస్వతి అభిషేకం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులతో పలకలపై అక్షరాల దిద్ది ఇస్తూ అక్షరాభ్యాసం చేయించారు. మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:దత్త పీఠం లో సరస్వతి దేవి పూజలు

Conclusion:దత్త పీఠం లో సరస్వతి దేవి పూజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.