నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నా.. తప్పించుకునేేందుకు వాహనదారులు నూతన పంథాలు వెతుకుతున్నారు.
ఏకంగా నెంబర్ పేట్లే మారుస్తున్నారు..
కొందరు నెంబర్ ప్లేట్లలో కొన్ని నెంబర్లను చెరిపేస్తుంటే.. మరికొందరు ఏకంగా నెంబర్ ప్లేటే మార్చి వాహనాన్ని నడుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో జరిమానాలు సైతం విధిస్తున్నారు.
ఒకే వాహనం 9 చలానాలు..
తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనానికి తొమ్మిది చలానాలు వచ్చాయి. తాను ఏ తప్పు చేయకుండా తమ పేరు మీద 6 ట్రాఫిక్ చలానాలు ఎలా వచ్చాయని ఆరా తీసి.. అసలు సంగతిని తెలుసుకున్నారు. చలానాలో ట్రాక్టర్ పేరు ఉండటంతో షాక్ తిన్న ద్విచక్ర వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు.
ఆ వాహనం స్వాధీనం..
ఫిర్యాదును స్వీకరించిన ట్రాఫిక్ పోలీసులు నకిలీ నెంబర్ ప్లేట్తో తిరుగుతున్న వాహనాన్ని గుర్తించారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణాశాఖ అధికారులకు అందజేయగాా వారు భారీ జరిమానా విధించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
నగరంలో కొంతమంది అక్రమార్కులు తమ వాహనాల నెంబర్లు మార్చి నడుపుతున్న ఆరు వాహనాలను గుర్తించినట్లు విజయవాడ ఏడీసీపీ సర్కార్ పేర్కొన్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగిస్తున్నారని గుర్తించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : హార్డ్ వేర్ షాపులో అగ్నిప్రమాదం..ఎగసిపడిన మంటలు