ETV Bharat / state

సంక్రాంతి ఎఫెక్ట్: కీసర టోల్ ​ప్లాజాకు పోటెత్తిన వాహనాలు - టోల్ గేట్లు

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్​ప్లాజా.. భారీగా వచ్చిన వాహనాలతో కిటకిటలాడింది. హైదరాబాద్​ నుంచి విపరీతంగా వాహనాలు ఈ ప్రాంతం మీదుగా వెళ్లాయి. వరుస సెలవులు, సంక్రాంతి వచ్చిన కారణంగా.. ఇంత భారీగా వాహనాలు పోటెత్తాయి.

traffic jam at keesara toll plaza
కీసర టోల్​ప్లాజాకు పోటెత్తిన వాహనాలు
author img

By

Published : Jan 9, 2021, 2:10 PM IST

కీసర టోల్​ప్లాజాకు పోటెత్తిన వాహనాలు..

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి ఏపీలో వేర్వేరు ప్రాంతాలకు భారీగా తరలి వెళ్తున్న ప్రయాణికుల వాహనాలతో కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. వాహనాలు వందల సంఖ్యలో బారులు తీరాయి. దీంతో టోల్ ప్లాజా వసూలులో జాప్యం జరుగుతోంది. ఫాస్ట్ ట్రాక్ ఉన్నప్పటికీ వాటిలో సాంకేతిక లోపంతో వాహనాలు నిలిచిపోతున్నాయి.

వరుస సెలవులతో స్వగ్రామాలకు..

రెండో శనివారం కావటం.. ఆదివారం సెలవు రోజు కావడంతో పండగకు నాలుగు రోజులు ముందుగానే హైదరాబాద్ నుంచి జనం స్వస్థలాలకు బయల్దేరారు. జాతీయ రహదారిపై కార్లు రాకపోకలు పెరగడంతో రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు తగ్గట్టుగా క్యూలైన్ల సంఖ్యను పెంచి టోల్ గేట్ వద్ద జాప్యం లేకుండా చూడాలని ప్రయాణికులు కోరారు. తెలంగాణలో టోల్ గేట్ వద్ద ఎటువంటి జాప్యం లేకుండా ముందుకు పంపుతున్నారని కీసర టోల్ ప్లాజా వద్ద మాత్రం జాప్యం జరుగుతుందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుంచి వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల రద్దీ నెలకొందని కీసర టోల్ ప్లాజా చీఫ్ ఎఫ్ ఆపరేషన్ మెయింటినెన్స్ హరి తెలిపారు. టోల్ వసూలుకు ఐదు లేన్లు కేటాయించినట్లు చెప్పారు. అవసరానికి తగ్గట్టుగా అదనంగా లైన్లు సిద్ధంగా ఉంచామని అన్నారు. అన్ని లైన్లలో ఫాస్ట్ ట్రాక్ ఉందని వీటితో పాటు నగదు వసూలు కూడా చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

హైకోర్టుకు సంక్రాంతి సెలవులు.. 18న పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.