కృష్ణా జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హోటళ్లకు టూరిజం ఎక్స్లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. కేరళ రాష్ట్ర జీడీపీలో 11 శాతం పర్యటకానేదే అని మంత్రి అవంతి అన్నారు. రాష్ట్రంలోనూ పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్న ఆయన...పర్యటకుల కోసం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను తీసుకొస్తామని తెలిపారు.
ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్న హోటళ్లు
* ఉత్తమ 5 స్టార్ హోటల్- విశాఖ నోవాటెల్
* ఉత్తమ 5 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- విజయవాడ గేట్ వే
* ఉత్తమ 4 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- విశాఖ పామ్‌బీచ్ హోటల్
* ఉత్తమ 3 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)- హోటల్ బ్లీస్
* ఉత్తమ పర్యావరణహిత హోటల్- పల్లవి రిసార్ట్స్, పాలకొల్లు
ఇదీ చూడండి: కొక్కిలిగడ్డ ప్రభుత్వ బడి... ఎదుగుతోంది ప్రైవేటుతో పోటీ పడి...