ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేయరని గన్నవరం వైకాపా ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. గన్నవరం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలను పేరుపేరునా పలకరించి వంశీ వ్యవహారంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ జెండా మోసి అక్రమ కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీకి నిస్వార్థంగా సేవలు చేసేది కార్యకర్తలేనని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. సోమవారం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు, వైకాపా శ్రేణుల మనోగతాన్ని వివరిస్తానన్నారు. కలలో కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేయరని ధీమా వ్యక్తం చేశారు.
"జగన్ అన్యాయం చేస్తారని...కలలో కూడా ఊహించను" - గన్నవరం రాజకీయాలు
తెదేపా ఎమ్మెల్యే వంశీ వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలతో గన్నవరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వంశీ రాకను పార్టీ నేతలు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని నియోజకవర్గ బాధ్యుడు వెంకట్రావు తెలిపారు.