అడవి పందుల నుంచి రక్షణగా పంట చుట్టూ చీరలు కట్టారు..! - 'To save the corn crop, we cut the sarees news
కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులు మొక్కజొన్న పంటను పక్షులు, పందుల బారి నుంచి కాపాడుకోవటానికి పంట చేను చుట్టూ చీరలు అడ్డుగా కట్టారు. చీరలు కట్టటం వల్ల అడవి పందులు, పక్షులు బెదిరిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక్కో ఎకరాకు సుమారు 50 చీరలు అవుతున్నాయని తెలిపారు. వీటికి డిమాండ్ పెరగడం వల్ల తక్కువ ధర ఉన్న కొత్త చీరలు కొనుగోలు చేసి.. మొక్కజొన్న చుట్టూ కడుతున్నామని అన్నదాతలు పేర్కొన్నారు.
అడవి పందుల నుంచి రక్షణగా పంట చుట్టూ చీరలు కట్టారు..!