Tirupatamma Fair: కృష్ణా జిల్లాలో తిరుపతమ్మ పరివార దేవతామూర్తులు జగ్గయ్యపేటలో రంగుల తంతు ముగించుకుని తిరిగి పెనుగంచిప్రోలుకి పల్లకిలో చేరుకున్నారు. జగ్గయ్యపేటలో శనివారం ఉదయం బయలుదేరిన తిరుపతమ్మ చిల్లకల్లు చేరుకొని బస చేశారు. ఆదివారం ఉదయం చిల్లకల్లు నుంచి వేడుకగా భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోలుకు పయనయమై.. రాత్రికి లింగగూడెం చేరుకున్నారు.
పల్లకిలో వేడుకగా తరలివస్తున్న అమ్మవారికి భక్తులు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. టెంకాయలు, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అంకమ్మ తల్లికి మేకపోతులు, గొర్రె పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: సాయిబాబా... మా సీఎం మనసు మార్చు: అమరావతి రైతులు