ఇదీచూడండి.ప్రభుత్వంపై బురదజల్లేందుకే ప్రతిపక్ష విమర్శలు: మంత్రి అనిల్
కృష్ణా నదిపై 3 చెక్‌డ్యాంలు! - krishna river
కృష్ణా నది సముద్రంలో కలిసేలోపు ప్రకాశం బ్యారేజి దిగువన మూడు చెక్‌డ్యాంలు నిర్మించాలనే ప్రతిపాదనపై జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది
three check dams wiil be construct on krishna river
కృష్ణా నది సముద్రంలో కలిసేలోపు ప్రకాశం బ్యారేజిరి దిగువన మూడు చెక్‌డ్యాంలు నిర్మించాలనే ప్రతిపాదనపై జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. గతంలో బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు ఎగువన వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజి నిర్మాణానికి కసరత్తు దాదాపు కొలిక్కి తీసుకొచ్చారు. వైకుంఠపురం బ్యారేజికి టెండర్లు పిలిచి పనులు అప్పగించినా, ప్రస్తుతం అవి నిలిపివేశారు. కొనసాగించాలా, నిలిపివేయాలా అన్న విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వరుస చెక్‌డ్యాంల ప్రతిపాదన వచ్చింది. జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కృష్ణా డెల్టా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. హైడ్రాలజీ విభాగంతో కలిసి వీటికి ఒక రూపు తీసుకురావాలని నిర్దేశించారు. ఇంజనీర్ల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి,సర్వే చేయిచేస్తోంది. 10-15 రోజుల్లో పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సముద్రజలాలు ఎగదన్నడంతో నదికి ఇరువైపులా ఉన్న అనేక ప్రాంతాలు ఉప్పువనీటి కయ్యలుగా మారిపోతున్నాయి. సాగుకు అవకాశం లేకుండా పోతోంది. మంచినీటికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏడాదిలో చాలారోజులు నదిలో ప్రవాహాలు లేక సముద్రజలాలు ఎగువకు ఎగదన్ని భూములు చౌడుబారిపోతున్నాయి.ప్రకాశం దాటిన తర్వాత కృష్ణానది దాదాపు 85 కిలోమీటర్ల మేర ప్రవాహించి సముద్రంలో కలిసిపోతుంది. కృష్ణాజలాలు ప్రకాశం బ్యారేజిని దాటుతున్న సందర్భాలు అరుదు. కనీస ప్రవాహాలు దిగువకు లేకుండా పోతున్నాయి. చెక్‌డ్యాంలు నిర్మించడంవల్ల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భజలాలలు వృద్ధి చెందుతాయి. ఉప్పునీటి సమస్యను సైతం అరికట్టవచ్చు. తాగునీటి సమస్యలు పరిష్కారవుతాయి.
ఇదీచూడండి.ప్రభుత్వంపై బురదజల్లేందుకే ప్రతిపక్ష విమర్శలు: మంత్రి అనిల్
Intro:Ap_Nlr_06_03_Variety_Vinayakulu_Kiran_Avbb_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరులో వైవిధ్యభరితంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని స్టోన్ హౌస్ పేట దగ్గర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను అలరిస్తోంది. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను చెవి ద్వారా వేస్తే తొండం ద్వారా అవి బయటికి వచ్చేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న భక్తులు, నేరుగా స్వామివారి చెవిలోనే దక్షణ వేసి పూజలు చేస్తున్నారు. వెరైటీ విగ్రహాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వినాయక ఉత్సవ కమిటీలు చేపడుతున్నాయి. నగరంలోని 9వ డివిజన్ యనమలవారిపాళెంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం వద్ద ఉత్సవ కమిటి భక్తులకు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దాదాపు మూడు వందల తులసి మొక్కలను భక్తులకు అందజేసి, మొక్కలు ఆవశ్యకత తెలియజేశారు
బైట్: నాగేశ్వరరావు, యనమలవారిపాలెం, నెల్లూరు.
రామయ్య, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291