ETV Bharat / state

ఆసుపత్రుల్లో తక్షణం వెయ్యి పడకలు సిద్ధం చేయాలి: కలెక్టర్ - కరోనా కేసులపై కలెక్టర్ ఇంతియాజ్ కామెంట్స్

కృష్ణా జిల్లాలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నందున ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్షణం వెయ్యి పడకలను సిద్ధంగా ఉంచాలని కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆసుపత్రుల్లో తక్షణం వెయ్యి పడకలు సిద్ధం చేఆసుపత్రుల్లో తక్షణం వెయ్యి పడకలు సిద్ధం చేయాలి: కలెక్టర్యాలి: కలెక్టర్
ఆసుపత్రుల్లో తక్షణం వెయ్యి పడకలు సిద్ధం చేయాలి: కలెక్టర్
author img

By

Published : Apr 6, 2021, 4:49 PM IST

ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల.. కొవిడ్ విస్తరిస్తోందని.. కలెక్టర్ ఇంతియాజ్​ అన్నారు. గత డిసెంబరు 2,800 కేసులు, ఈ ఏడాది జనవరిలో 830 కేసులు, ఫిబ్రవరిలో కేవలం 250 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. తిరిగి కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోందని.. కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించడం.. వారిని గుర్తించడం.. చికిత్సలు చేయడం ద్వారానే వ్యాప్తిని తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత ఏడాది మార్చిలో ప్రారంభమైన కొవిడ్‌ వ్యాప్తి.. ఈసారి మరింత ప్రమాదకరంగా తయారైందని చెప్పారు.

ఎలాంటి లక్షణాలు లేకుండా కొందరిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని కలెక్టర్ అన్నారు. తొలిసారి కరోనా వచ్చిన సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించి జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొన్నామని... తిరిగి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు 19 ఆసుపత్రులను తిరిగి సిద్ధం చేస్తున్నామని అన్నారు.

ఇందులో విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి... మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి, పిన్నమనేని, నిమ్రా ఆసుపత్రులతోపాటు మరో 15 ఆసుపత్రులు ఉన్నాయని కలెక్టర్ ఇంతియాజ్​ తెలిపారు. వెయ్యి పడకలను కొవిడ్‌ కేర్‌ సెంటర్ల కోసం ఏర్పాటు చేస్తున్నామని సంయుక్త కలెక్టరు ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. జిల్లాస్థాయిలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఆయా ఆసుపత్రులకు బాధితులను పంపిస్తామన్నారు. ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా అగ్నిమాక రక్షణకు సంబంధించి ఎన్‌ఓసీలను ముందుగానే పొందాలని కోరారు. కరోనా టీకాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని.. జిల్లాలో ఇంతవరకు రెండు లక్ష 80 వేల మంది టీకా వేయించుకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకించిన పురిటి గడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.