కృష్ణా జిల్లా నూజివీడులో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మండల తహసీల్దారు ఎం.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. నూజివీడులోని ఎస్డీఏ జూనియర్ కళాశాలలో సీఏఎస్ఈసీ ప్రాక్టికల్ పరీక్షలను అధికారులు పరిశీలించారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు రావటంతో సబ్ కలెక్టర్ నేతృత్వంలో బృందంగా వెళ్లి పరిశీలన చేసినట్లు సురేష్ కుమార్ తెలిపారు. 138 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు ఆరు గదులను కేటాయించినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధంలేని లోయర్ క్లాస్ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్స్గా కళాశాల యాజమాన్యం నియమించినట్లు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని నిశితంగా పరిశీలించి... ప్రామాణికత ప్రకారం విద్యార్థులు ముందడుగు వేస్తే సరైన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
ఇవీ చదవండి: