ETV Bharat / state

పది,ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో ప్రజాహిత వాజ్యాలు - Andhra Pradesh High Court

కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోందంటూ... హైకోర్టులో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. 2020-21 విద్యా సంవత్సరానికి చెందిన పది,....... ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయటం రద్దు చేసేలా ఆదేశించాలని కోరారు.

పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలను సవాల్‌ చేస్తూ తెదేపా హైకోర్టులో పిటిషన్

author img

By

Published : Apr 29, 2021, 4:07 AM IST

Updated : Apr 29, 2021, 4:13 AM IST

కోవిడ్ కేసులు పెరుగుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం.. పది, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించటాన్ని సవాల్ చేస్తూ....... హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షలను రద్దు చేయాలని పిటిషన్లలో...... విద్యార్థులు కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14. 73 కోట్ల మంది కరోనా బారిన పడ్డారన..... 31.12 లక్షల మంది మృతిచెందారని పిటిషన్లలో పేర్కొన్నారు. అమెరికా తర్వాత అంతగా కరోనా ప్రభావితమైన దేశం మనదేనని గుర్తు చేశారు.ఏప్రిల్ 27 నాటికి దేశంలో 1.76 కోట్ల మందికి కోవిడ్ సోకిందన్నారు. 1.97 లక్షల మంది రోగులుమృతి చెందారని తెలిపారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లెక్కల ప్రకారం రాష్ర్టంలో..10.51 లక్షల మందికి కరోనా సోకగా 7వేల 800 మంది కన్నుమూశారని పిటిషన్‌లో వివరించారు.

కరోనా రెండో దశ భయంకరంగా ఉంది. రోజు రోజుకు వ్యాప్తి.. అధికమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను ప్రమాదంలో పడేస్తూ పరీక్షలు నిర్వహించబోతున్నారు . శానిటైజేషన్ , భౌతిక దూరం తదితర జాగ్రత్తలు వహించినా కరోనా ప్రాణ హాని కల్పించే ప్రమాదకారి అనే భయాందోళన విద్యార్థులు , తల్లిదండ్రుల్లో ఉందన్నారు . 6.3 లక్షల మంది పదో తరగతి , 10.6 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది . పరీక్షలు నిర్వహించే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారు . కరోనా నేపథ్యంలో సీబీఎస్ ఈ , సీబఎస్ సీఈ .. పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది . తమిళనాడు , తెలంగాణ , మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయన్నారు . రాష్ట్రంలోనూ రద్దు చేయాలని , వాయిదా వేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . ఆ వినతిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు . ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేసేలా లేదా రద్దు చేసేలా ఆదేశాలు జారీచేయండి " అని కోరారు . కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పది , ఇంటర్మీడియట్ పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేసేలా ఆదేశించాలని కోరుతూ గ్లోబల్ పీస్ ఇన్షియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మరో పిల్ దాఖలు చేశారు . లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని పిల్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు . పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు , వారి కుటుంబ సభ్యులు కరోనాకు ప్రభావితులయ్యే అవకాశం ఉందన్నారు . ప్రస్తుతం పరీక్షలు నిర్వహించకుండా కొంత సమయం వేచి ఉండటం ఉత్తమం అని పేర్కొన్నారు .

ఇవీ చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి

Last Updated : Apr 29, 2021, 4:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.