ETV Bharat / state

'కంకర అక్రమ తవ్వకాలు... నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్​ నియామాకం'

కృష్ణా జిల్లాలో కంకర అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ చేసేందుకు అడ్వొకేట్ కమిషన్​ను నియమించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి.. నివేదిక ఇవ్వాలని కమిషన్​ను ఆదేశించింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 22, 2022, 4:58 AM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న కంకర అక్రమ తవ్వకాల విషయంలో దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ చేసేందుకు అడ్వొకేట్ కమిషన్​ను నియమించింది. హైకోర్టు న్యాయవాది అశ్వత్థనారాయణను అడ్వొకేట్ కమిషనర్​గా నియమించిన న్యాయస్థానం .. అతనికి ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాలని పిటిషనర్​ను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో జిల్లా సర్వేయర్ ఆధ్వర్యంలోని బృందంతో పరిశీలన చేసి.. నివేదిక ఇవ్వాలని కమిషనర్​ను ఆదేశించింది. విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

తోటపల్లి గ్రామంలో ఎల్వీవీఆర్వీ ప్రసాద్ అనే వ్యక్తి 12 హెక్టారుల్లో గ్రావెల్ మైనింగ్​కు అనుమతి పొంది .. పరిధికి మించి 200 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ మద్దూరు గ్రామానికి చెందిన యనమదల రంజిత్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులు తీసుకున్నదానికి మించి మైనింగ్ నిర్వహిస్తున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది బి.చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. ప్రజా ఖజానాకు గండీకొడుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ఇదీ చదవండి: HIGH COURT: 'నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల వివరాలివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.