కృష్ణా జిల్లా నూజివీడులో.. ఓ జంట తమ గోమాతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించింది. రాంబాబు, నాగేశ్వరమ్మ దంపతులు కొన్నాళ్లుగా గోవును పెంచుకుంటున్నారు. అది మృతి చెందగా.. తల్లడిల్లిపోయారు. కాటికాపరిగా పనిచేస్తున్న రాంబాబుకు కొన్నాళ్ల క్రితం దూడని.. ఓ వ్యక్తి బహుమానంగా అందించాడు. మూడేళ్లుగా దానికి అల్లారుముద్దుగా చూసుకునేవారు. లక్ష్మీ అని పేరు కూడా పెట్టారు. ఈ తరుణంలో సోమవారం ఆవుకు అనారోగ్యం చేసింది. రాంబాబు వైద్యం చేయించినా మృతి చెందింది. ఆ దంపతులు దుఃఖాన్ని దిగమింగి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తమ పూర్వీకుల సమాధుల చెంతనే గోవును ఖననం చేశారు.
గోమాతకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు
మూగ జీవాన్ని ప్రాణప్రదంగా పెంచాడు. ఆ గోమాతకు లక్ష్మీ అని పేరు పెట్టుకుని కన్నబిడ్డలా చూసేవాడు. ఇలా ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవు మరణించటంపై కన్నీరుమున్నీరయ్యాడు. కుటుంబ సభ్యులు మరణిస్తే అంతిమ సంస్కారం ఏ రీతిలో చేస్తారో.. అలాగే అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
కృష్ణా జిల్లా నూజివీడులో.. ఓ జంట తమ గోమాతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించింది. రాంబాబు, నాగేశ్వరమ్మ దంపతులు కొన్నాళ్లుగా గోవును పెంచుకుంటున్నారు. అది మృతి చెందగా.. తల్లడిల్లిపోయారు. కాటికాపరిగా పనిచేస్తున్న రాంబాబుకు కొన్నాళ్ల క్రితం దూడని.. ఓ వ్యక్తి బహుమానంగా అందించాడు. మూడేళ్లుగా దానికి అల్లారుముద్దుగా చూసుకునేవారు. లక్ష్మీ అని పేరు కూడా పెట్టారు. ఈ తరుణంలో సోమవారం ఆవుకు అనారోగ్యం చేసింది. రాంబాబు వైద్యం చేయించినా మృతి చెందింది. ఆ దంపతులు దుఃఖాన్ని దిగమింగి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తమ పూర్వీకుల సమాధుల చెంతనే గోవును ఖననం చేశారు.
Body:స్వతంత్ర దినోత్సవ వేడుకలు
Conclusion:అనంతపురం జిల్లా