తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సూరంపాలెం వద్ద జరిగింది. మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 35 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చాట్రాయి ఎస్సై శివన్నారాయణ తెలిపారు.
ఇదీ చదవండి : విశాఖలో మూతపడుతున్న మద్యం దుకాణాలు