ETV Bharat / state

అభిరుచి ఉంటే.. ఎంతైనా ఎదగొచ్చు.. ఈ ప్రయాణం చూడండి! - ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సునీల్ తాజా వార్తలు

మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆ యువకుడు... అంతర్జాతీయ స్థాయి ఐటీ నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వినూత్న ఆవిష్కరణలతో... కార్పొరేట్‌ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టిస్తూ.... ఆశ్చర్య పరుస్తున్నాడు. దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలే తమ వద్ద పనిచేయాలంటూ స్వయంగా ఆహ్వానించే స్థాయికి ఎదిగాడు సునీల్‌ కుమార్. ఎదగాలనే ఆకాంక్ష, చేసే పనిపై శ్రద్ధ ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నాడు గ్రామీణ యువకుడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కృత్రిమ మేధలో రాణిస్తూ దిగ్గజంలా ఎదిగాడు

అభిరుచి ఉంటే.. ఎంతైనా ఎదగొచ్చు.. ఈ ప్రయాణం చూడండి!

author img

By

Published : Nov 14, 2020, 8:28 PM IST

Updated : Nov 14, 2020, 9:03 PM IST

సునీల్‌కుమార్‌..... కార్పొరేట్‌ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. 2020 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక జినోవ్‌ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో టెక్నికల్‌ రోల్‌మోడల్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యువకుడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న భారతీయ సంస్థలు, నిపుణులకు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తుంది జినోవ్‌ సంస్థ. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో అత్యున్నత పురస్కారం సునీల్‌ను వరించింది.

కృష్ణా జిల్లా నాగాయలంక సునీల్‌కుమార్‌ స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే సునీల్.... విజయవాడలో బీటెక్‌, ఐఐటీ-రూర్కీలో ఎంటెక్‌ చేశాడు. ఎక్స్‌ఛేంజ్‌ స్కాలర్‌ ప్రోగ్రాంలో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ప్రాంగణ నియామకంలో ఒరాకిల్‌లో ఉద్యోగం సంపాదించాడు. అప్లికేషన్‌ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేసి, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీపై ఆసక్తితో ఇన్ఫోసిస్‌లో చేరాడు.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లో సెన్సింగ్‌, యాక్టివేషన్‌ ద్వారా ప్రొగ్రామ్స్‌ రూపొందించేవాడు సునీల్ కుమార్. ఇంట్లో, కార్యాలయంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే సాంకేతికతను అభివృద్ధి చేశాడు. క్రమంగా ఎదుగుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కొత్తవారికి మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు. ఇన్ఫోసిస్‌..... అమెరికా, ఇంగ్లాండ్‌లోని శాఖలకు నాయకత్వం వహించాడు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ మరిన్ని అద్భుతాలు చేయనుందని సునీల్‌ నమ్మకం.

2019లో దేశంలోని పదిమంది ఉత్తమ డేటా నిపుణుల్లో ఒకరిగా సునీల్‌ నిలిచారు. అనలిటిక్స్‌ మ్యాగజైన్‌ చేసిన సర్వేలో అత్యుత్తమ కృత్రిమ మేథ దిగ్గజంగా గుర్తింపు పొందాడు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేథ అంశంపై సునీల్‌ పేరు మీద 25 పేటెంట్స్‌ హక్కులు ఉండటం విశేషం. ఒకవైపు పరిశోధనలు చేస్తూనే... వాటిని విశ్లేషిస్తూ వ్యాసాలు రాసేవాడు. అతడు రాసిన 30 వరకు వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వాటిలో రెండు బెస్ట్‌ పేపర్ అవార్డును దక్కించుకున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను సద్వినియోగం చేసుకుంటే మరింత వృద్ధి సాధించొచ్చన్నది సునీల్‌ అభిప్రాయం.

కృత్రిమ మేధలో తనకంటూ ఓ పేరును సంపాదించటంతో దిగ్గజ కంపెనీల నుంచి సునీల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫిలిప్స్‌ రీసెర్చ్‌ సంస్థ పిలుపు మేరకు ప్రిన్సిపల్‌ సైంటిస్టుగా అందులో పనిచేశాడు. అక్కడ కృత్రిమ మేథస్సుతో పనిచేసే హెల్త్‌ సిస్టంను రూపొందించటంలో కీలక పాత్ర పోషించాడు. ఎరిక్‌సన్‌ గ్లోబల్‌ ఏఐ యాక్సిలేటర్‌కు డేటా సైన్స్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేసే స్థాయికి ఎదిగాడు సునీల్‌.

తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో చిన్నప్పటి నుంచి బోధనపై సునీల్‌కు ఆసక్తి ఉండేది. ఆ ఇష్టంతోనే వారాంతాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్నాడు సునీల్‌. తనకు తెలిసిన విద్యను విద్యార్ధులకు, కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులకు బోధిస్తున్నాడు. ఐఐటీ, ఐఐఎం, ఎన్​ఐటీ, ఐఐఐటీ లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో కళాశాలల్లో అతిథి అధ్యాపకునిగా సేవలందిస్తున్నాడు. కరోనా వల్ల అనేక రంగాలకు ఇబ్బంది ఎదురైనా ఐటీ పరిశోధన విభాగానికి సమస్య లేదని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం కంప్యూటర్‌తో నడవని కార్యాలయం లేదు. కాబట్టి కృత్రిమ మేధస్సు క్రమంగా అన్ని రంగాలను ప్రభావితం చేయనుందని సునీల్‌ అభిప్రాయం. కార్పొరేట్‌ రంగంలో కృత్రిమ మేధ కీలకపాత్ర పోషించనుందని చెబుతున్నాడు. కృత్రిమ మేథలో ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నాడు.

ప్రయత్న లోపం లేకుండా కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని సునీల్‌ కుమార్‌ నిరూపిస్తున్నాడు. అభిరుచి ఉన్న రంగాన్ని ఎంచుకుని కష్టపడితే ఎవరైనా విజేతలవుతారనడానికి సునీల్‌ ప్రయాణమే ఓ నిదర్శనం.

ఇదీ చదవండి: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

Last Updated : Nov 14, 2020, 9:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.