ఉల్లి, కూరగాయల ధరలు తగ్గించాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ తెదేపా కార్యాలయం ఆవరణలో తెలుగు మహిళ నాయకులు నిరసన చేపట్టారు. కూరగాయలు, ఉల్లి దండలు వేసుకొని ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ పక్క ప్రభుత్వ పథకాలు ఇస్తూనే మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ట్యాక్సులు పెంచి సామాన్యూడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. రాష్ట్రవ్యాప్తంగా కన్నులపండువగా దేవిశరన్నవరాత్రులు