ముఖ్యమంత్రి జగన్కు పరిపాలనలో అనుభవం లేదని, టాప్ 3లో ఉన్న రాష్ట్రాన్ని 20వ స్థానంలోకి దిగజార్చారని విమర్శించారు. అమరావతిలో 130 సంస్థలను పోగొట్టి 60వేల ఉద్యోగాలు అందకుండా చేశారని అన్నారు. పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
గన్నవరం రన్ వే విస్తరణకు భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖత్వంతో, వితండ వాదనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రతి దానిలోనూ కుంభకోణాలే...
ఇసుక, మద్యం, భూములు, గనులు, ప్రతి దానిలో వైకాపా కుంభకోణాలకు పాల్పడిందన్న చంద్రబాబు... అవినీతి కుంభకోణాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. హత్యలు చేయడంలో, వాటిని ఆత్మహత్యలుగా చిత్రించడంలో వైకాపా నాయకులు సిద్దహస్తులని ఆరోపించారు.
ఇదీ చదవండి: