ETV Bharat / state

'చోరీకి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి' - buddha venkanna latest news

'విజయవాడ దుర్గమ్మ గుడిలో చోరీ ఘటనకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి' అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

TDP mlc buddha venkanna demand to cbi enquiry on temple assault
తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
author img

By

Published : Sep 16, 2020, 7:01 AM IST

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండితో తాపడం చేసిన మూడు సింహాల ప్రతిమలు చోరీకి గురయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన విడుదల చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... రాష్ట్రంలో దేవాలయాలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు.

దేవాదాయ భూముల ఆక్రమణలు, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, వెండి తాపడాల మాయం.. ఇలా రోజుకో దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ఇదీ చదవండి:

వచ్చే విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.