TDP leaders fire on CM Jagan: 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' తప్పుడు కేసులతో తెలుగుదేశం పార్టీని అడ్డుకోలేవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నేటి ప్రతీ చర్యకూ రేపు ప్రతిచర్య ఉంటుందని గుర్తుంచుకో అని హితవు పలికారు. నేడు తమ కార్యకర్త చిందించిన ప్రతి రక్తపు బొట్టుకూ రేపు సమాధానం చెప్తామన్నారు. పుంగనూరు, అంగళ్లులో దాడులకు ఉసిగొల్పింది జగన్ రెడ్డే అని ఆరోపించారు. చంద్రబాబుపై కేసు నమోదు జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరితో జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందన్నారు. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పుడు కేసులని విమర్శించారు. రోడ్ షోలకు వస్తున్న జనాదరణ చూసి ఫ్రస్ట్రేషన్ మొదలైందన్నారు. జగన్ రెడ్డి పిల్ల చేష్టలు నవ్వు తెప్పిస్తున్నాయన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ పర్యటన రూట్‌లో వైసీపీ కార్యకర్తలకు ఏం పని ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీలు, ధర్నాలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారని నిలదీశారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపై కేసులు పెట్టడం తుగ్లక్ రెడ్డికే చెల్లిందని ఆక్షేపించారు.
Devineni Umamaheswara Rao అంగళ్లు ఘర్షణలకు అసలు కుట్రదారులు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఎస్పీ రిషాంత్ రెడ్డి అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేసులు తమపై కాదు... చేతనైతే అసలు కుట్రదారులపై పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో తమ చిటికెన వేలు వెంట్రుక కూడా పీకలేరని పేర్కొన్నారు. 13 కార్లు ధ్వంసం చేసి.. తిరిగి మా పైనే కేసులా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు రాళ్లేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు.
Ashok Gajapathiraju చిత్తూరు జిల్లా అంగళ్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదుని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఖండించారు. ఎవరిపైన కేసులు పెట్టాలి, ఎవరిపైన పెట్టకూడదు అనే విచక్షణ వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. టీడీపీ విజయనగరం జిల్లా కార్యాలయంలో అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే కేసులు పెడుతున్నారని అన్నారు. వారి నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ(TDP)పై అనేక కేసులు పెట్టారని, ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేయడానికి రాజ్యాంగానికి విరుద్ధగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలా దారుణమన్నారు. చంద్రబాబు కి సెక్యూరిటీ తీసేస్తే.. చంపేస్తాం అని స్పీకర్ మాట్లాడడం సిగ్గుచేటు. అలాంటి వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు. చంద్రబాబు మీద రాళ్లు వేసిన ఒక్కరిపైనా అయినా కేస్ నమోదు చేశారా..? అని అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా ప్రశ్నించారు. డీజీపీ పదే పదే చేతులు కట్టుకొని హైకోర్టు ముందు నిలబడడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మంత్రులు తమ పని ఏ మాత్రం చేయడం లేదని విమర్శించారు. అభివృద్ధి మాత్రం లేదు పేపర్ ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని అశోక్ గజపతి రాజు దుయ్యబట్టారు.
MLC Bhumi Reddy Ram Gopal Reddy మా అధినేత చంద్రబాబు(Chandrababu), మేము ధైర్యంగా విజయనగరంలోనే ఉన్నాం.. ప్రభుత్వానికి అంత దమ్ము, ధైర్యం ఉంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేసుల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని వెల్లడించారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఆయన.. ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని చంద్రబాబు పర్యటిస్తున్నారని తెలిపారు. వైసీపీ వాళ్లే దాడులు చేస్తారు.. కేసులు మాత్రం మాపై పెడతారా..? అని ప్రశ్నించారు. దాడుల్లో పోలీసులే సాక్ష్యం వారికి కూడా దెబ్బలు తగిలాయన్నారు.
Buddha Venkanna జగన్ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆరునెలల సమయమే ఉందని తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా లారీ ఎవరు పెట్టారని ప్రశ్నించారు. డ్రైవర్ మీద ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. తాము అధికారం లోకి వచ్చాక ఎస్పీ రిషాంత్ రెడ్డి సంగతి తెల్చుతామని స్పష్టం చేశారు.
TDP Leaders అంగళ్లు వద్ద చంద్రబాబును అడ్డుకున్నవారిపై ఒక్క కేసైనా పెట్టారా? అని ఎన్.విజయ్‌కుమార్ ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు మోహరించి ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు రాళ్ల దాడి చేస్తుంటే పోలీసుల మౌనమెందుకు? అని అన్నారు. దాడుల్లో లేకుండా ఇంట్లో ఉన్నా కేసులా? అని నల్లారి కిశోర్ కుమారుడు అమర్నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తే కేసులు పెడతారా..? రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదే సాక్ష్యం అని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. దాడులకు అసలు కారణం పోలీసులే.. ముందుగా ఎస్పీని సస్పెండ్ చేయాలని జీవీ ఆంజనేయులు అన్నారు.
TDP Chief Chandrababu Fire on CM Jagan: పోలవరంపై మాట తప్పిన జగన్ రెడ్డికి 'జూ' కట్టించాలి: చంద్రబాబు