ETV Bharat / state

'ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లాక్‌డౌన్‌ పొడిగించాలి'

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లాక్‌డౌన్‌ పొడిగించాలని తెదేపా డిమాండ్‌ చేసింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చూడాలని తెదేపా ప్రభుత్వానికి సూచించింది. పార్టీలకతీతంగా పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. కరోనా నివారణకు వస్తున్న విరాళాలు ప్రకటనలకే ఖర్చు చేస్తున్నారని విమర్శించింది. మంత్రులు, వైకాపా నేతలు లాక్‌డౌన్‌ నిబంధలు పాటించట్లేదని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

tdp-leaders-comments-on-ysrcp
tdp-leaders-comments-on-ysrcp
author img

By

Published : Apr 13, 2020, 6:00 PM IST

'ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లాక్‌డౌన్‌ పొడిగించాలి'

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలని, నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చూడాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. పార్టీలకతీతంగా పేదలకు 5 వేల రూపాయల ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోరారు. నిత్యావసర సరుకులను పౌరసరఫరాలశాఖ ఇంటింటికీ అందించాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు వస్తున్న విరాళాలను ప్రకటనల కోసమే సీఎం జగన్‌ ఖర్చు చేస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు. మంత్రులు, వైకాపా నేతలు లాక్‌డౌన్‌ నిబంధలు పాటించట్లేదని విమర్శించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి కలసికట్టుగా పని చేద్దామని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: 3డీ ప్రింటర్​తో కరోనాపై పోరు- ఎలా సాధ్యం?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.