రాష్ట్రంలో సారా మాఫియా ఉందని స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పినా వైకాపా నేతలకు సిగ్గు రావడం లేదని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. మంత్రి కొడాలి నాని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. అది సరి కాదని హితవు పలికారు. తన శాఖలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు తిరగబడతారన్నారు. చంద్రబాబు వయసు గురించి మంత్రుల వ్యాఖ్యలు సిగ్గుచేటని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి..