![tdp-leader nara lokesh tweet on pattiseema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5021088_lokesh.jpg)
విజనరీ లీడర్‌కి పాయిజన్ లీడర్‌కి ఎంతో వ్యత్యాసం ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఒంటి నిండా విషం ఉన్న లీడర్... ముందు చూపు లేక వరద నీటిని వినియోగించుకోలేక ప్రజల్ని ముంచి నీటిని సముద్రం పాలుచేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకునేవారు విజనరీ లీడర్ అన్న ఆయన.... పట్టిసీమ అలాంటి ఆలోచన నుంచి పుట్టిందేనని పేర్కొన్నారు. పనికిరాని పట్టిసీమ అన్నవారితోనే మళ్లీ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందని నారా లోకేశ్ అన్నారు.
ఇదీ చూడండి: