వైకాపా నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడి బందరు పోర్టును బలి చేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. బందరు పోర్టు నిర్మాణంలో నవయుగ సంస్థను కొనసాగిస్తే.. ఇవాళ మచిలీపట్నం పోర్టుకు షిప్ వచ్చేదన్నారు. బందరు పోర్టు కోసం తెదేపా భూసమీకరణ చేస్తే రైతులకు ఎదో అన్యాయం జరిగిపోతుందని వైకాపా నాయకులు నానాయాగీ చేశారని మండిపడ్డారు. పోర్టు నిర్మాణంపై డబ్బా కొడుతున్న మంత్రి పేర్ని నాని.. పోర్టు పనులు ఎందుకు మొదలుపెట్టడం లేదని నిలదీశారు.
బందరు ఎంపి బాలశౌరి చుట్టం చూపుకు వచ్చినట్లు మచిలీపట్నం వస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు ఇచ్చామన్న కొల్లు రవీంద్ర.. మీరు కూడా రైతులకు డబ్బులు ఇచ్చి పనులు ప్రారంభించాలన్నారు. పోర్టు భూములను తాకట్టు పెట్టి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి