జగనన్న కాలనీల పేరిట వైకాపా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఇంటి నిర్మాణానికా, లేక చేపల పెంపకానికా అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు దోచుకున్న రూ.4500కోట్ల అవినీతిపై సీఐడీ విచారణ జరిపించకుండా.. జరగని అవినీతిపై విచారణలు చేయించి ఏం లాభమన్నారు. జగనన్న కాలనీల పేరిట చెరువులు పేదలకు ఇచ్చారంటూ కొన్ని ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు కృష్ణా, గోదావరి నదుల్ని తలపిస్తుంటే ఇక కుండపోత వర్షం కురిస్తే పరిస్థితేంటని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే జలమయమైన స్థలాలపై నివేదిక తెప్పించుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: TTD: తితిదే అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన