పేదప్రజలను ఇళ్లస్థలాల పేరుతో ప్రభుత్వం మభ్యపెట్టాలని చూడటం దారుణమని మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పేదవర్గాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీప్లస్-3 ఇళ్లను ఎందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నివాసయోగ్యంకాని భూములను ఇళ్ల స్థలాలుగా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రతిపక్షంపై లేనిపోని ఆరోపణలు చేయడంమాని.. పేదలకు ఉపయోగపడే స్థలాలు ఇస్తే తాము.. సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పేదలకు ఇంటిస్థలంపై ఉండే ఆశలతో ఆటలాడుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీచదవండి: ఏ విపత్తుకైనా ప్రకృతిలోనే పరిష్కారాలు!