నంబూరు శంకర్రావు, ఆళ్ల రామకృష్ణ రెడ్డి, శ్రీదేవి, మంత్రి కొడలి నాని, బ్రహ్మనాయుడు, ఏసు రత్నం తదితరులు రాజధాని ప్రాంతంలో భూముల కొనలేదా అని నిలదీశారు. రాజధానిలో భూముల కొనుగోలుపై వైకాపా పదే పదే అవాస్తవాలు చెబుతోందని ఉమ ఆరోపించారు. రెండు జిల్లాలో జరిగిన ప్రతి కొనుగోలును తెలుగుదేశం పార్టీకి అంటగడుతున్నారని ఆక్షేపించారు. కూతురుకి తల్లి ఇచ్చినా తెదేపా వాళ్లే కొన్నారని అంటున్నారని ఆరోపించటమేమిటని నిలదీశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నీరుకొండలో 5 ఎకరాలు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కొన్న భూములు, వైకాపా నుంచి పోటీ చేసిన ఏసురత్నం రాజధానిలో కొన్న భూములు, ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు, శ్రీదేవిల భూముల సంగతేంటని నిలదీశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలు ముసుగు వేసుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు. రాజధాని భూములపై సిట్టింగ్ జడ్జితో పాటు ఎలాంటి విచారణకైనా తెదేపా సిద్ధమని ప్రకటించారు.
బోగస్ వీడియో..!
అసలు గ్రాఫిక్స్ ఏమిటో ఇవాళ బోగస్ వీడియో ద్వారా వైకాపా నేతలు చూపించారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. జైలుకెళ్లి వచ్చిన జగన్ను తమ వద్ద ఉంచుకుని ఇవాళ చంద్రబాబు జైలుకి పంపిస్తామనటం హాస్యాస్పదమన్నారు.
ఇదీ చదవండి :