ETV Bharat / state

వైకాపా పాలనలో దళితులపై దాడులు ఆగవా?: తంగిరాల సౌమ్య - jujjuru village latest news

వైకాపా ప్రభుత్వ హయాంలో రోజురోజుకూ దళితులపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య మండిపడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

tangirala sowmya
tangirala sowmya
author img

By

Published : Nov 5, 2020, 10:53 PM IST

వైకాపా పాలనలో దళితులపై దాడులు ఆగవా అని కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశ్నించారు. గురువారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి వెళ్లిన ఆమె...తెదేపా కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.

వైకాపా ప్రభుత్వంలో రోజురోజుకూ దళితులపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దళితులపై వైకాపా నేతలు దాడులకు తెగబడడం, అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలను ఆపకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

'లేఖ' వివాదం: ఏజీకి అశ్వినీ కుమార్ మరో ఉత్తరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.