ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. దీనిపై చందర్లపాడు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. చందర్లపాడు మండలం ఉస్తేపల్లి వద్ద కృష్ణా నది నుంచి రోజుకు కొన్ని వందల లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆమె ఆరోపించారు.
నేరుగా నదిలోకే లారీలను తీసుకెళ్లి జేసీబీల ద్వారా పరిమితికి మించి ఇసుక లోడింగ్ చేస్తున్నారన్నారు. అనధికారికంగా పక్క రాష్ట్రాలకు తరలిస్తూ.. అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వడం వలన ఉస్తేపల్లి, గుడిమెట్ల మంచినీటి పథకాలకు నీరు అందని పరిస్థితి ఉందన్నారు.
ఇవీ చదవండి.. ‘మంత్రి కొడాలి నానిని.. సీఎం భర్తరఫ్ చేయాలి’