నెల్లూరు జిల్లా నాయుడుపేట 24వ డివిజన్ తెదేపా అభ్యర్థి రాజేంద్రను కులం పేరతో దూషించిన ఎస్ఐ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన ఎస్ఐపై కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. రాజేంద్రను కులం పేరుతో దూషించటంతో పాటు చొక్కా విప్పించి బహిరంగ ప్రదేశంలో నిలబెట్టటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి