సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో కీలక నిందితుడు పండు.. గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల, ఛాతీ భాగంపై పండుకు స్వల్పగాయాలు కాగా... గత వారం నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. పటిష్ఠ పోలీస్ బందోబస్తు మధ్య వైద్యులు పండుకు చికిత్స అందిస్తున్నారు.
అతన్ని ఈరోజు సాయంత్రం లేక రేపు డిశ్చార్జ్ చేసే అవకాశముందని వైద్యులు చెప్పారు. అన్ని వైద్య చికిత్సలు అనంతరం ఈరోజు డిశ్చార్జ్ చేయడానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పండు తన చేతి కి స్పర్శ లేదని చెప్పడంతో మరల అతనికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అతను చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందని అనే దానిపై విచారణ జరిపి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.
ఇదీ చదవండి: 'జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు'