కృష్ణా జిల్లా గన్నవరం మండలం బలిపర్రు గ్రామానికి చెందిన సొంగా స్వప్న కుమారి.. విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగినిగా పనిచేసింది. కొంత కాలంగా ఆమెకు 24 గంటల కడుపు నొప్పి వస్తే తల్లిదండ్రులు శస్త్రచికిత్స చేయించారు.
ఆపరేషన్ వికటించగా.. తిరిగి ఆసుపత్రికి వెళ్దామంటే లాక్డౌన్ కారణంగా వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో 2 రోజులుగా విపరీతంగా కడుపునొప్పి వస్తుండగా ఇంటి సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పండింది స్వప్నకుమారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీయించారు. శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: