ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విజయవాడలో ఎస్ఎప్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. 100 శాతం ఫీజు బకాయిలు, ఉపకార వేతనాలు చెల్లిస్తామని చెప్పి 7 నెలలు పూర్తైనా సీఎం హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని విద్యార్థి సమాఖ్య నాయకులు రమేష్ మండిపడ్డారు. ఉపకార వేతనాలు విడుదల చేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: