రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల లారీ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహాసభ నిర్వహించారు. డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు లారీలో ఇసుక లోడింగ్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: