కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ తిరునాళ్లలో భాగంగా అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నదిలో భక్తుల స్నానాలు
రెండు రోజులుగా జరుగుతున్న తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా వారం క్రితం అధికారులు సాగర్ జలాలు విడుదల చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులకు మున్నేరు జలాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. మున్నేరు ఇసుకతిన్నెలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని సేద తీరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం నాలుగు చోట్ల జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. అయినా.. పిల్లలు, పెద్దలు పారుతున్న నీటిలోనే జలకాలడుతూ ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దు