శ్రావణ మాసంలో పూల ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఉన్న ధరలకు మూడొంతులు పెరిగి కొనాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. వ్రతాల్లో ముఖ్యంగా ఉపయోగించే చామంతి, బంతి, గులాబీల ధరలు ఆకాశం వైపు చూస్తుంటే.. కొలుగోలుదారులు పూలవైపు బిత్తరచూపులు చూస్తున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ధరలతో అమ్మకందారులూ ఇబ్బంది పడుతున్నారు. పండుగ రోజుల్లో రూపాయి లాభం వస్తుందని ఆశ పడిన తమకు నిరాశ తప్పడం లేదంటున్నారు చిరువ్యాపారులు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పూల పంటలు వేసి తెగుళ్లతో నష్టపోయిన రైతులను వరుణుడు కరుణించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆషాడమాసం, వర్షాభావ పరిస్థితుల వలన పోయిన గిరాకీ శ్రావణమాసం తీసుకొచ్చిందని రైతులు సంతోష పడుతున్నారు.
ఇదీ చదవండి : పొగాకు వద్దు... ఆరోగ్యమే ముద్దు