ETV Bharat / state

కార్తిక మాసం: మహేశ్వరుని ఆలయ మహిమలు - karthika masam special

కుమారస్వామిని పెంచిన కృత్తికల పేరిట వచ్చినదే కార్తికమాసం. అందుకే ఇది పరమశివుడికి ప్రియమైన మాసం. సృష్టి ఆరంభం జరిగిందీ త్రేతాయుగం మొదలైందీ ఈ నెలలోనే... ఇలా మరెన్నో విశేషాలతో నిండిన కార్తికంలో లింగరూపంలో కొలువైన ఆ మహేశ్వరుడిని దర్శించుకుని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తుంటారు భక్తులు. అందుకే పంచముఖుడైన పరమశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలూ పంచభూతలింగాలూ పంచారామాలూ... వంటి సుప్రసిద్ధ శైవక్షేత్రాలతోపాటు అరుదైన నిర్మాణంతో ప్రాచుర్యంలోకి వచ్చిన శివలింగాల్నీ సందర్శిస్తుంటారు. అలాంటి ప్రత్యేకతలతో అలరారే శివలింగాల్లో కొన్ని...

special story on lord siva
కార్తీక మాస ప్రత్యేకత
author img

By

Published : Nov 29, 2020, 11:52 AM IST

సువర్ణ శోభిత లింగం!

సువర్ణ శోభిత లింగం!

మారేడు దళాలూ జిల్లేడుపూలతో పూజిస్తేనే ప్రీతి చెందే బోళాశంకరుడిని స్వర్ణ లింగం రూపంలో దర్శించుకోవాలంటే నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించాల్సిందే. నృసింహక్షేత్రమైన యాదాద్రి సమీపంలో ఉన్న ఈ గ్రామం, ‘రమణేశ్వరం’గా పేరొందింది. 2014లో సిద్ధగురు రమణానంద మహర్షి అక్కడ శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాన్ని నెలకొల్పారు. అందులో ద్వాదశ జ్యోతిర్లింగాల్నీ, సువర్ణ లింగాన్నీ, 1008 లింగాల్నీ, స్ఫటికలింగాన్నీ, 63 అడుగుల శివలింగాన్నీ ప్రతిష్ఠించడంతో ఈ ఊరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి శివభక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. బూడిదనే అలంకారంగా చేసుకున్న ఆ గరళకంఠుడి సంకేతమైన లింగాన్ని తొలిసారిగా 250 కిలోల బంగారంతో రూపొందించిన ఘనతనీ దక్కించుకుంది. శివరాత్రితోపాటు కార్తికమాసంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా ఆలయానికి వచ్చి, స్వహస్తాలతో సువర్ణ లింగాన్ని అభిషేకించడం ద్వారా శివార్చన చేస్తూ ఆ సర్వేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు.

తత్ప్రణమామి సదాశివలింగం..!

పొడవైన శివలింగం!

పొడవైన శివలింగం!

సృష్టి స్థితి కారకులైన బ్రహ్మదేవుడికీ శ్రీమహావిష్ణువుకీ మధ్య ఎవరు గొప్ప అనే విషయంమీద మొదలైన వాగ్వాదాన్ని అడ్డుకునేందుకు లయకారుడైన ముక్కంటి తేజోలింగ రూపంలో ఉద్భవిస్తాడు. ఆ మహోజ్వల రూపం ఆద్యంతాలు కనుగొనేందుకు బ్రహ్మ ఆకాశ మార్గానా, విష్ణుమూర్తి పాతాళమార్గానా వెళ్లి అది తెలుసుకోలేక శివుని సన్నిధికి చేరుకుని ఓటమిని ఒప్పుకుంటారు. ఈ లింగోద్భవగాథను దృష్టిలో పెట్టుకునే కాబోలు, అత్యంత పొడవైన శివలింగాన్ని సుమారు పదికోట్ల రూపాయలతో తిరువనంతపురం సమీపంలో చెంకల్‌లోని శివపార్వతి ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. మహేశ్వరంగా పిలుస్తోన్న ఈ క్షేత్రంలో 111.2 అడుగుల ఎత్తూ 50 అడుగుల వెడల్పులతో నిర్మించిన ఈ లింగం లోపలిభాగం హిమాలయ కొండల్నీ గుహల్నీ తలపిస్తుంది. కాశీ, గంగోత్రి, రిషీకేశ్‌, రామేశ్వరం, బద్రీనాథ్‌, గోముఖ్‌, కైలాస్‌... ఇలా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టినీ ఇసుకనీ నీటినీ తీసుకొచ్చి మరీ దీన్ని నిర్మించారట. ఎనిమిది అంతస్తులుగా ఉన్న ఆ లింగంలోని కింది భాగం మానవ శరీరంలోని ఆరు చక్రాల్నీ ప్రతిఫలిస్తే పైభాగం కైలాసాన్ని పోలి ఉంటుందట. కింది భాగంలో 108 శివలింగాలూ 64 శివరూపాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ ఆలయ సముదాయంలో భక్తులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా ధ్యానకేంద్రాల్నీ ఏర్పాటుచేయడం విశేషం.

తత్ప్రణమామి సదాశివలింగం..!
తత్ప్రణమామి సదాశివలింగం..!

మెరుపుల మహాదేవుడు!

మెరుపుల మహాదేవుడు!

శివుడు పంచభూతాత్మకుడు... పృథ్వి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని... ఇలా అన్నీ ఆయనలో లయమై ఉన్నవే. అందుకేనేమో ఆకాశంలో విరిసే మెరుపు రూపంలోనూ తన మహిమల్ని చాటుకుంటూ భక్తకోటికి అభయమిస్తున్నాడా హరుడు. దీన్ని కళ్లారా చూడాలంటే బిజిలీ మహాదేవ్‌ ఆలయానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే- నింగిలో మెరిసే మెరుపుల తాకిడికి ముక్కలై, ఆపై మళ్లీ అతుక్కుపోయే అద్భుత శివలింగం హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ లోయలో ఉన్న ఆ మందిరంలో కనిపిస్తుంది. ధౌలాధార్‌, పీర్‌ పంజల్‌ పర్వతశ్రేణుల మధ్యలో బీస్‌, పార్వతి నదులు సంగమించే ప్రదేశంలో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెప్పే ఈ ఆలయ పైభాగంలో ఏటా క్రమం తప్పకుండా ఒకే సమయంలో మెరుపులు మెరుస్తాయట. ఆ మెరుపుల దాడికి విగ్రహం ముక్కలైపోతుందట. పూజారి వెన్న; ధాన్యం, పప్పులు కలిపి మరపట్టిన పిండితో అతికించిన మర్నాటికే పగిలిన ఆనవాలు కూడా లేకుండా అది మళ్లీ యథారూపాన్ని సంతరించుకుంటుందట. దాంతో ప్రకృతి భీభత్సాల నుంచి చుట్టుపక్కల గ్రామాల్ని ఆ శంకరుడే కాపాడు తున్నాడనేది స్థానికుల విశ్వాసం.

తత్ప్రణమామి సదాశివలింగం..!

పాదరసంలో పరమేశ్వరుడు!

పాదరసంలో పరమేశ్వరుడు!

పంచభూతాలూ స్ఫటిక రూపాలూ శిలారూపాలతో రూపొందిన శివలింగాలు అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటాయి. కానీ పాదరసంతో శివలింగాన్ని నిర్మించిన ఘనత నిజామాబాద్‌ జిల్లాలోని అంక్సాపూర్‌ దత్త పీఠానికే చెందుతుంది. రామాయణ కాలంలో రావణబ్రహ్మ దగ్గర మాత్రమే ఈ రకమైన లింగం ఉండేదట. పాదరస లింగం ఎంతో మహిమాన్వితమైనదనీ పాపవిముక్తుల్ని చేస్తుందనీ భావిస్తారు భక్తులు. కానీ ఎవరైతే దీన్ని ప్రతిష్ఠిస్తారో వాళ్లు ఆ నిర్మాణం పూర్తయ్యేలోగా మరణిస్తారట. ఆ కారణంతోనే హంపి, పుష్పగిరుల్లోని పీఠాల్లో దీన్ని ప్రతిష్ఠించాలనుకున్నా ఎవరూ సాహసించలేదట. అయితే మహిమాన్వితమైన ఈ లింగ ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకున్న పడాల విఠల్‌ గౌడ్‌ మహరాజ్‌, అంక్సాపూర్‌ పీఠంలో దీన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. అనుకోవడమేకాదు, గణపతి సచ్చిదానంద స్వామి, చిన జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో- విగ్రహప్రతిష్ఠ చేసి శివాలయాన్నీ నిర్మించారు. అయితే పూర్తయిన కొన్ని రోజులకే ఆయన అనారోగ్యంతో మరణించడం దురదృష్టకరం. 500 కిలోల బరువున్న ఈ పాదరస లింగానికి చుట్టూ 108 చిన్న చిన్న శివలింగాల్నీ ఏర్పాటుచేశారు. ద్రవరూపంలోని పాదరసానికి కొన్ని రసాయనాల్ని కలిపి గట్టిపడేలా చేసి లింగరూపాన్నిచ్చారట. అపురూపమైన ఈ లింగం వల్లే కష్టాలన్నీ తీరి తమ గ్రామం సుసంపన్నంగా వెలుగొందుతుందని అంక్సాపూర్‌ గ్రామస్తులు భావిస్తుంటారు. దాంతో చుట్టుపక్కల గ్రామాలవాళ్లూ ఏటా కార్తికంలో ఆ లింగదర్శనం చేసుకునేందుకు వేలసంఖ్యలో తరలి వస్తుంటారట.

గుడిమల్లం... పురాతన శివలింగం!

గుడిమల్లం... పురాతన శివలింగం!

శివుడు లింగ రూపుడు... ఆ రూపంలో పూజించే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా తెలీదు కానీ వేంకటేశ్వరుని అవతారానికి చెందిన గాథలో భృగుమహర్షి ‘నేటి నుంచి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు’ అని శపించినట్లు వరాహపురాణం పేర్కొంటోంది. దీన్నిబట్టి అంతకుపూర్వం ఆ లయకారుణ్ణి మానవరూపంలోనూ పూజించేవారని తెలుస్తోంది. దీనికి ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తుంది చిత్తూరుజిల్లా గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం. పురుషాంగాన్ని పోలిన ఇక్కడి లింగం అరుదైనదే కాదు, ప్రాచీనమైనది కూడా. ఇక్కడ ముఖమండపంకన్నా గర్భాలయం లోతులో ఉంటుంది. అందుకే దీనికి గుడిపల్లం అని పేరు. అందులో కొలువైన మహాశివుడు వీరుడైన వేటగాడి రూపంలో దర్శనమిస్తూ పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ఐదు అడుగుల ఎత్తున్న లింగంమీద కుడిచేతిలో గొర్రెపోతునీ ఎడమచేతిలో చిన్న గిన్నెనీ పట్టుకుని ఎడమ భుజానికి ఓ గండ్రగొడ్డలి తగిలించుకుని యక్షుని భుజాలపై నిలబడ్డ రుద్రుని ప్రతిమ కనిపిస్తుందిక్కడ. ఈ ఆలయాన్ని ఆంధ్ర శాతవాహనుల హయాంలో క్రీ.పూ. 2- 3వ శతాబ్దాల మధ్య నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారో మాత్రం తెలియడం లేదు. గుడికి సంబంధించిన ఆనవాళ్లు ఉజ్జయినీ రాజ్యకాలంలో వాడిన నాణాలమీద కనిపించాయట. స్వామి జటాభార తలకట్టుతో నడుము నుంచి మోకాళ్ల వరకూ వస్త్రాన్ని ధరించి ఉంటాడు. యజ్ఞోపవీతం లేని స్వామి వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికీ ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి సమాచారం లేదట.

తత్ప్రణమామి సదాశివలింగం..!

విభూతేశ్వరుడు!

విభూతేశ్వరుడు!

కంచిలో కొలువైన విశ్వేశ్వరలింగం పృథ్వీరూపం- అంటే, మట్టితో తయారైంది. కాబట్టి దాన్ని కేవలం నూనెతోనే అభిషేకిస్తుంటారు. అయితే కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని పంగళ జంగం మఠ్‌లో గతేడాది వెలుగు చూసిన లింగం విభూతితో నిర్మితం కావడం ఒకెత్తయితే, అది నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం మరొకెత్తు. ఎం.ఎస్‌.ఆర్‌.ఎస్‌ కాలేజ్‌కు చెందిన ఆర్కియాలజీ విభాగం కనుగొన్న ఈ లింగం, అడుగు ఎత్తులో ఉందట. దీన్ని విజయనగర చక్రవర్తులకు సామంతులైన కళది నాయక్‌ రాజుల కాలంలో, అంటే- క్రీ.శ. 1641లోనే రూపొందించినప్పటికీ లోహకవచం తొడిగి అభిషేకం చేయడం వల్ల ఇది ఏమాత్రం దెబ్బతినకుండా ఉందని అక్కడే దొరికిన రాగి శాసనాన్ని బట్టి భావిస్తున్నారు పురాతత్త్వనిపుణులు.

ఇవేకాదు, పంచభూతాత్మకుడూ పంచాక్షరీ మంత్రస్వరూపుడైన ఆ సర్వేశ్వరుడి ప్రతిరూపమూ శుభ సంకేతమూ అయిన శివలింగంతో కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రాలు దేశవ్యాప్తంగా ఎన్నో... మరెన్నో..!

ఇదీ చదవండీ...వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.