SP Kowshal New year Celebrations : నూతన సంవత్సర వేడుకల్ని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ వినూత్నంగా జరుపుకున్నారు. మచిలీపట్నంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న పోలీసు ఉద్యోగులు, హోంగార్డుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు స్వయంగా శుభాకాంక్షలు తెలియచేశారు.
సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి బహుమతులు అందజేశారు. ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలోనూ ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇనస్పెక్టర్లు కిందిస్థాయి సిబ్బంది నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియచేశారు. అలాగే బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి : Book Exhibition in Vijayawada: విజయవాడలో పుస్తక ప్రదర్శన..