ETV Bharat / state

డంపింగ్ యార్డుతో.. గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు

author img

By

Published : Jun 3, 2019, 1:28 PM IST

విజయనగర శివారులోని పాతపాడు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగలు, దుర్వాసనతో సమీప ప్రాంతంలోని రైతులు, గ్రామస్తులు అన్ని విధాల నష్టాలకు గురవుతున్నామని ఆందోళన చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి డంపింగ్ యార్డులను తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు.

డంపింగ్ యార్డులతో తీవ్ర ఇబ్బందులు...ఆందోళనలో గ్రామస్తులు

విజయవాడ నగర శివారులోని డంపింగ్ యార్డుకి చెత్తను గత కొన్నేళ్లుగా తరలిస్తున్నారు. దీని ద్వారా సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవటంతో దట్టమైన పొగ ద్వారా శ్వాసకోశ వ్యాధులతో చాలామంది అస్వస్థతకు లోనవుతున్నారు. తడిపొడి చెత్తాలను వేరుచేసి శాస్త్రీయ పద్దతిలో భూమిలో కలిపే విధానాన్ని ఇటీవల కాలంలో అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా మెుదలుపెట్టారు. ఇలా నగరంలోని తడి, పొడి చెత్తలను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించేవారు. కానీ ప్రస్తుతం చెత్తను నామమాత్రంగా తరలించి తడి, పొడి చెత్తను వేరు చేయకుండా తగలబెట్టి కార్పొరేషన్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. 365 రోజులు డంపింగ్ యార్డులో చెత్త మండుతూనే ఉండటంతో అటువైపుగా వెళ్లాల్సిన గ్రామస్తులు వేరొక మార్గంలో ప్రయాణిస్తూ ఆ మార్గాన్ని మర్చిపోయారు. చెత్తను కాల్చటంతో భూమి సారవంతం కోల్పోయి పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితమై వింత జబ్బులు ప్రబలుతున్నాయని అంటున్నారు. గాలిలో విష వాయువుల ప్రభావంతో అస్వస్థతకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వేలాది మంది గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఈ డంపింగ్ యార్డ్ వైపు అధికారుల దృష్టి సారించి ఈ ప్రాంతంలోని గ్రామాల ప్రజల కష్టాలను తొలగించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.

ఇవీ చదవండి.

అడ్డొచ్చిన కుక్క.. బైక్​పై నుంచి పడి వ్యక్తి మృతి

యాంకర్: శాసన సభ్యులు గా విజయం సాధించి తొలిసారిగా రోలుగుంట చేరుకున్న కరణం ధర్మశ్రీ కి విశాఖ జిల్లా రోలుగుంట లో ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోలుగుంట చేరుకుని ధర్మశ్రీ కివిజయ హారతులు పట్టారు. ముందుగా గ్రామంలో ఊరేగింపు గా తీసుకొచ్చి గ్రామాల వారీగా శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ధర్మశ్రీ మాట్లాడుతూ కేంద్రం సహాయం గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.OVER

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.