ETV Bharat / state

18 టన్నులకు బిల్లు.. 25 టన్నులకుపైగా తరలింపు - కృష్ణా జిల్లా నేర వార్తలు

తీసుకున్న బిల్లు కంటే ఎక్కువగా ఇసుకను తరలించిన ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 175 టన్నుల ఇసుక, టిప్పర్​ను సీజ్ చేశారు.

sand mafia
sand mafia
author img

By

Published : Jul 30, 2020, 5:46 PM IST

కృష్ణా జిల్లాలో మరో ఇసుక దందా బయటపడింది. అక్రమంగా తరలించిన 175 టన్నుల ఇసుకను కంచికచర్ల పోలీసులు సీజ్ చేశారు. కంచికచర్ల మార్కెట్ యార్డు వద్ద స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(సెబ్​) ఏఎస్పీ వకుల్ జిందాల్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

కొందరు వ్యక్తులు 18 టన్నుల ఇసుక తరలింపునకు బిల్లు తీసుకున్నారు. కానీ 25 టన్నులకు పైగా ఇసుకను తరలించారు. ఇసుక ర్యాంపు వద్ద ఉన్న ఓ జేసీబీ ఆపరేటర్ నిందితులకు సహకరించాడు. కంచికచర్ల, గొట్టుముక్కల, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఆరు చోట్ల ఇసుకను దిగుమతి చేసినట్లు గుర్తించాం. దీనికి సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. ఒక టిప్పర్​తోపాటు 175 టన్నుల ఇసుక సీజ్ చేశాం- వకుల్ జిందాల్ , కృష్ణా జిల్లా సెబ్ ఏఎస్పీ

ఇదీ చదవండి

ప్రపంచమంతా ఓ దారి.. నాదో దారి అని సీఎం అనుకోవద్దు: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.