దసరా పండగ రద్దీ దృష్ట్యా అవసరమైన బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి 28 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దూర ప్రాంత బస్సు సర్వీసులన్నీ పూర్తి స్థాయిలో రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి అన్ని జిల్లాల ఆర్ఎంలను ఆదేశించారు.
లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు 2028 దూర ప్రాంత బస్సులు నడిచేవి. ఈ నెల 15 నుంచి వీటన్నింటినీ నడపాలని నిర్దేశించారు. ఈ బస్సులన్నింటిలో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి రిజర్వేషన్ చేసుకునే సర్వీసుల సంఖ్య పెంచాలని ఆదేశాల్లో తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులును ఏర్పాటు చేయాలని ఆర్ఎంలకు ఈడీ ఆదేశాలు జారీ చేశారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్దరించిన అనంతరమే తెలంగాణకు బస్సులు నడపాలని సూచించారు.
ఇదీ చదవండి