ETV Bharat / state

రెడ్ క్రాస్ ఉదారత... కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత - కృష్ణా జిల్లా వార్తలు

అత్యవసర పరిస్థితిలో ఉన్న కొవిడ్‌ బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలుస్తోంది. ఆక్సిజన్ అందక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి కాన్సంట్రేటర్లను అందించి మానవత్వాన్ని చాటుకుంటోంది. త్వరలో కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కొవిడ్ సేవలను విస్తరింపజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సోసైటీ ఛైర్మన్ డా.సమరం స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడలో 65 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

oxygen concentrators
కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత
author img

By

Published : Jul 4, 2021, 9:38 PM IST

కొవిడ్ కారణంగా ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు విడిచారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చింది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పుడు రెడ్ క్రాస్ సంస్థ నుంచి ఉచితంగా మాస్క్ లు, హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడిసిన్ కిట్లను అందజేశారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేశారు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు కాన్సంట్రేటర్లను అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

సింగపూర్, మలేషియా, అమెరికా నుంచి దాతలు విరాళంగా ఇచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రెడ్ క్రాస్ సంస్థ జిల్లా ఛైర్మన్ డా.సమరం... బాధితులకు అందిస్తున్నారు. కొవిడ్​తో చికిత్స పొందుతున్న బాధితులు, కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారిలో ఆక్సిజన్ అవసరమైన వారికి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

అందుబాటులో 65 కాన్సంట్రేటర్లు..

విజయవాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ సొసైటీ.. బ్లడ్ బ్యాంక్ కేంద్రంగా ఈ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో 65 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నయని డా.సమరం తెలిపారు. వీటిలో 20 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తున్నామన్నారు. జిల్లాలో అవనిగడ్డలో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచి బాధితులకు ఉచిత సేవలందిస్తున్నామని చెప్పారు.

నిత్యం బాధితులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం వస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరు 15 నుంచి నెల రోజుల వరకు వీటిని వినియోగిస్తున్నారని అన్నారు. కొవిడ్ సోకి ఇబ్బందిపడుతున్న తమ వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారని బాధిత బంధువులు తెలిపారు. ఎక్కడా దొరక్కపోవటంతో రెడ్ క్రాస్ సంస్థ వద్దకు వచ్చామని... వెంటనే సాయం చేశారని కృతజ్ఞతలు చెప్పారు.

త్వరలోనే జిల్లా వ్యాప్తంగా సేవలు..

కొవిడ్ సేవలను జిల్లా అంతా విస్తరింపజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డా.సమరం తెలిపారు. కొద్ది రోజుల్లోనే జిల్లాలోని తండా ప్రాంతాల్లోని కరోనా బాధితులకు వైద్య సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు.

ఇదీ చదవండి:

Immunity: ఈ మొక్కలు ఆహారంలో భాగమైతే.. ఇమ్యూనిటీ మీ సొంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.