మూడో విడత రేషన్ తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం పెట్టటంతో వేలిముద్ర వేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లా కప్తానుపాలెంలో ఒక్కో రేషన్ షాపుకు 100 ఎంఎల్ శానిటైజర్ డబ్బాలు 2 ఇచ్చారని.. అవి 100 మందికి మాత్రమే సరిపోతాయని అంటున్నారు. ఒక్కో దుకాణం పరిధిలో సుమారు 500 వరకు కార్డుదారులం ఉన్నామని.. మిగతా వారికి శానిటైజర్ల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో చేతులకు గ్లవుజులు ఇస్తే బావుంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ విడతలో ఒక్కో మనిషికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చదవండి.. ఎంపీ మండపానికి రేషన్ బియ్యం...బాధ్యులపై వేటు