కరోనా కష్ట కాలంలో పేదలకు రేషన్ ఏడు విడతలుగా పంపిణీ చేస్తే.. రెండు విడతలకు మాత్రమే కమిషన్ ఇచ్చారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎనిమిదో విడత పంపిణీకి ఏర్పాట్లు పూర్తవటంతో బకాయిలు చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని డీలర్లు విజయవాడలో ధర్నా నిర్వహించారు.
ఆరుగురు రేషన్ డీలర్లు కరోనాతో మరణిస్తే కనీసం ప్రభుత్వం స్పందించ లేదని...ఒక్కో వితడతలో కోటిన్నర మంది చొప్పున నెలలో మూడు కోట్ల మందికి రేషన్ ఇచ్చామన్నారు. కరోనా రక్షణ పరికరాలు ఇవ్వకున్నా.. బాధ్యతతో పని చేశామన్నారు.
తమకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రల నిబంధన ఎత్తి వేయాలని...గుజరాత్ లో 25లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వగా, ఒడిశాలో వేలి ముద్రలు ఎత్తివేశారన్నారు. తమ సమస్యలపై అధికారులను కలిసి విన్నవిస్తే.. అవమానించేలా మాట్లాడారన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి న్యాయం చేసే వరకు విధులకు హాజరుకాబోమని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షలకు సిద్దంగా ఉన్నామన్నారు.
ఇదీ చూడండి