ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కొనసాగనుంది.
తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు..
విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించి ఉన్న ద్రోణి వల్ల.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి : CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'