కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీక్కుతింటున్నాయని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు మండిపడ్డారు. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త, డ్రైనేజ్లపై పన్నుల పెంపు జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని సచివాలయాల ముందు విన్నూత్నంగా నిరసన చేశారు.
మడమ తిప్పనన్న సీఎం జగన్... మోదీకి లొంగిపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర భాజపా నాయకులు ఇక్కడ ధర్నా చేయటం హాస్యాస్పదమన్నారు. ధైర్యం ఉంటే కేంద్రంలో మోదీని ప్రశ్నించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. లేదంటే అందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి