కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గం వైకాపా కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సామినేని కార్యకర్తలతో చర్చించారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలను పలువురు సీనియర్ నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిన్నంటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుని... అభివృద్ధికి దోహదపడతానన్నారు. అనంతరం పెనుగంచిప్రోలు మండలం వైకాపా అధ్యక్షుడిగా ఓట్ల నాగేశ్వరావును నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇవీ చదవండి