ETV Bharat / state

లక్కీడిప్​ ద్వారా డిశ్చార్జ్​ అయిన కొవిడ్​ బాధితులకు బహుమతులు

author img

By

Published : May 17, 2021, 4:39 PM IST

కొవిడ్​ కేర్​ సెంటర్లలో వైద్యం తీసుకుని.. ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటున్న వారితో కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ మాట్లాడారు. డిశ్చార్జ్​ అయిన వారిలో.. లక్కీడిప్​ ద్వారా ఎంపిక చేసిన వారికి బహుమతులు అందించారు.

Breaking News

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొంది.. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా ఇళ్లకు చేరుకుంటున్న వారితో కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. గూడవల్లి కొవిడ్ కేర్ సెంటర్​లో వైద్యసేవలు పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వారంలో డిశ్చార్జ్ అయిన 70 మంది జాబితాతో లక్కీడిప్ నిర్వహించారు. ఇందులో కె. సూర్యనారాయణ తొలి బహుమతిగా రూ.15 వేలు, కె. వెంకట నర్సమ్మ రెండో బహుమతి రూ.10 వేలు, టి.సురేంద్ర మూడో బహుమతి రూ.5 వేలు గెలుపొందారు. కలెక్టర్ సమక్షంలో తొలిసారిగా.. ఈ లక్కీడిప్​ కార్యక్రమం నిర్వహించారు. వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయిన ఎవరైనా… కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స తీసుకోవచ్చని జిల్లా పాలనాధికారి అన్నారు. ఈ కేంద్రాల్లో అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, కల్పిస్తున్న వసతి సౌకర్యాల పట్ల కొవిడ్​ రోగులు హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లతో జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: 'కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కీలకం.. ప్రత్యామ్నాయంగా ప్లాంట్ల ఏర్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.