విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29, ఏపీ విద్యా చట్టం సెక్షన్ 1, ఆంగ్ల మాధ్యమంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరతూ గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర మానవ వనరులశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ కె లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి